గాలి వీస్తోంది....నీరు ప్రవహిస్తోంది......అగ్ని జ్వలిస్తోంది......భూమి భరిస్తోంది.......చూడగలిగితే సూన్యం యా వత్ బ్రహ్మాండాన్ని చూపిస్తోంది.
ఎవరు భేష్ అన్నా......అనకపోయినా.......భు జం తట్టినా.....వెక్కిరించినా..... పొగిడినా......దూషించినా.....
ప్రార్ధించినా....విమర్శించినా .....కనీసం పట్టించుకోక పోయినా........
అన్నింటికీ అతీతంగా.......తరతరాలుగా జీవకోటి అవసరాలను తీరిస్తూ.......ఆ భగవంతుని ప్రతిరూపాలుగా విరాజిల్లుతున్నాయి, ఆ దివ్యమైన పంచభూతాలు.
ఆ పంచ భూతాల కోవకు చెందిన మనుష్యులూ ఉన్నారూ.
ఎందఱో మహానుభావులు తమ జీవితాలను ఈ జగద్దోదారణ కార్యక్రమములో భాగంగా త్యజించారు.
తాము నాటుతున్న విత్తనాలు రేపు మహావృక్షాలయిన రోజున, వాటి నీడలో పడుకునే వారు తమను గుర్తిస్తారో లేదో నన్న సంశయం గనుక వారిలో ఉండిఉంటే, బహుశా మనం పుట్టేనాటికే ఈ జగత్తంతయు ఇసుక ఎడారులుగా మారి, జీవించడానికి ఏ మాత్రమూ అవకాశం లేక మరణించియుండెడి వారమేమో.
అటువంటి ఉద్ధారకులలో ఒకరు, ఈ దేశానికీ, జాతికీ ఒక గుర్తింపుతెచ్చి, తానెవరో కూడా ఈ దేశం గుర్తించలేని స్థితిలో, కటిక దారిద్ర్యంలో కన్నుమూసారు.
-------------------------------------------------
2001 వ సంవత్సరం... ఏదో పని మీద నేను డిల్లీ వెళ్లాను.
India Gate వద్ద ఓ సర్దార్జి కొంతమంది విదేశీ యాత్రికులకి గైడు గా వ్యవహరిస్తున్నాడు.
జాతీయ పతాక విశిష్టత గూర్చి తనకు తెలిసినదేదో వారికి చెప్పేస్తున్నాడు.
ఇంతలో ఒక ఆవిడ అతన్ని " ఈ పతాకాన్ని ఎవరు తయారు చేసారు ? " అని అడిగింది.
ఆ సర్దార్జీ ఏమాత్రం తడుముకోకుండా " ఇంకెవరు ...... మా గాంధీజీ యే తయారుచేసుకున్నారు " అని చెప్పాడు.
నాకు ఒళ్లుమండింది..... వెంటనే వాడిని లాక్కెళ్ళి ఆ INDIA GATE పై నుండి తోసేయాలనిపించింది.
కాస్త శాంతంగా ఆలోచిస్తే.....
ఆ మహానుభావుడు, గుర్తింపు కోసం ప్రాకుళ్ళాడని వ్యక్తిత్వం కలిగిఉండడం......ఈ సర్దార్జి తప్పేలా అవుతుంది అనిపించింది.
![]() |
| INDIAN FLAG |
1899 వ సంవత్సరం.సాయంత్రం 6 గం!! Durban నగర సివారులలోని బ్రిటిష్ సైనిక శిబిరాలు.
Boer యుద్ధం జరుగుతున్న రోజులు.
సౌత్ఆఫ్రికా నల్ల జాతియులుకు చికిత్స నిమిత్తం, స్వచ్చందంగా సేవలు అందిస్తున్న Indian Ambulance corps , warrant officer , 30 సంవత్సరాల వయసుగల Mohandas, ఆ బ్రిటిష్ శిబిరాలలోకి తొంగిచూస్తూ ఎవరికోసమో వెతుకుతున్నారు.
ఒక శిబిరం ముందు ఆగి " Mr Venkaiah ? " అని ఓ బ్రిటిష్ - ఇండియా ఆయుదాల accounts రాసే సైనికుడి వైపు చూస్తూ ప్రస్నార్ధకంగా నిలుచు న్నారు.
" Mr Mohandas ......very happy to meet you "....అని పొడుగాటి ఆ కుర్రవాడు బయటకొచ్చి మోహన్ దాస్ ని అభిమానంగా కౌగిలించుకున్నాడు. " I read the articles you write on behalf of ' Natal Indian Congress ' on racism....i was the one who wrote those letters to you.....namaste ....I am pingali venkaiah ..... from bezawada ...... andhra " .
తనని ప్రోత్సహిస్తూ ఉత్తరాలు రాసే అభిమాని, సౌత్ ఆఫ్రికా వచ్చాడని, తను పని చేస్తున్న శిబిరంలోనే ఉన్నాడని తెలుసుకుని, వెతుకుంటూ వచ్చాడు, రాబోయే కాలాన్ని నడిపించబోయే బాపూజీ ' శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ'.
![]() |
| MK Gandhi., Warrant Officer., Indian Ambulance Corps. |
-----------------------------------------
1916 అక్టోబర్......కాకినాడ లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ మహాసభ.
" నమస్తే భాపు "......
" నమస్తే వెంకయ్యా జీ ....ఇందాక మీరు ఏదో చెప్పబోతున్నారు....
ఆ హడావుడిలో నేను వినలేకపోయాను.....ఇప్పుడు చెప్పరూ "
"ఈ స్వరాజ్య ఉద్యమంలో భాగంగా దేశం మొత్తాన్ని ఒక్క తాటిపైకి తేవాలంటే మనకో చిహ్నం కావాలి.....
ఆ చిహ్నం మన ఆత్మగౌరవాన్ని, సమైక్యతని, సాంప్రదాయాన్ని......ఒక్క మాటలో చెప్పాలంటే మన జాతిని ప్రతిబింబించాలి....
అతి సామాన్యుడు సైతం ఆ చిహ్నాన్ని చూసి ఉత్తేజితుడై ఉద్యమదిశగా కదం తొక్కాలి....
ఆ చిహ్నమే మన ఉద్యమ జెండా.....అజెండా కావాలి "
" భేష్.....చక్కటి ఆలోచన.....ఇంకెందుకు ఆలస్యం....... ముందు ఆ పని మీద ఉండండి
కొన్ని నమూనాలు తయారుచేసి మహా సభలకు పంపిస్తే....అందరి ఆమోదంతో ఏదో ఒక్క దానిని ఖరారు చేద్దాం "
![]() |
| Designs made by Pingali Venkaiah before making the final one |
1921 మార్చ్ 31 ......బెజవాడ....PWD గ్రౌండ్స్.
నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్......
లక్షల సంఖ్యలో జన సమూహం.....
వేదిక పై మహాత్మాగాంధీ, కస్తుర్బా, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్, సరోజినీ నాయుడు, జవహరలాల్ నెహ్రు, మోతిలాల్ నెహ్రు, గొల్ల నారాయణరావు, దాసు మధు సూధనరావు మొదలగు ప్రముఖ నేతలు........
లక్షల గళాల 'వందేమాతరం' అన్న నినాదాల మధ్య గాంధీగారి ప్రసంగం.......
ఆయన మాట్లాడుతున్న ప్రతీ మాటని ఎంతో శ్రద్దగా వింటూ మధ్య మధ్యలో ఉత్సాహభరితులయి చప్పట్లు చరుస్తున్నప్రజవాహిని......ఇం తలో ఒక్కసారిగా గాంధీగారు తన ప్రసంగాన్నిఆపి,
కర్రకి కట్టిన ఒక కొత్త జండాని భుజాన పెట్టుకుని, జనం మధ్యలోనుండి నడుస్తూ వస్తున్న వ్యక్తిని చూస్తున్నారు......
ఆ వ్యక్తీ సరాసరి వేదిక పైకొచ్చి, ఆ జండాని, లేచి నిలబడిన గాంధీగారి చేతికిచ్చి ఆయన ముందు మోకరిల్లాడు......
కాషాయం, తెలుపూ, ఆకుపచ్చ రంగులు, వాటి మధ్యలో చరకా కలిగిన ఆ జండాని, మహాత్ముడు రెండు చేతులా పట్టుకుని ఆత్మీయంగా చూస్తూ, తన నుదిటిని ఆన్చి అభివాదం చేసాడు.
జెండా చేత బూని ప్రజల వైపుకు తిరిగి....." నేటి నుండి ఈ ఉద్యామాన్ని......మావంటి నాయకులని....
భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు తలమానికంగా ఈ దేశాన్నీ ముందుకు నడిపే మహాశక్తే ఈ జెండా....."
అంటూ జెండా ఊపారు భాపుజీ....'వందేమాతరం' నినాదాలతో ఒక్కసారిగా మార్మోగిపోయింది యావత్తు బెజావాడ.
![]() |
| Finally the Tri color arrived from the heart of Mr. P.Venkaiah |
మౌసులిపట్నం (మచిలీపట్టణం) దగ్గరగల భట్లపెనుమర్రులో, నియోగి - బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి....
కొలొంబోలో విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, భారత స్వాతంత్ర ఉద్యమం పురుడు పోసుకుంటున్న సమయంలో, బ్రిటిష్ ఉద్యోగి హోదాలో సౌత్ఆఫ్రికా వెళ్లి , భవిష్యత్తు జాతిపిత శ్రీ M .K .గాంధీ తో చేతులు కలిపి , దాదాపు అర శతాబ్దం తన జాతి కొరకు చేసిన పోరులో సర్వాన్నీ త్యజించిన ఆ మహనీయుడు, ఈ దేశ మానాభిమాన సూచికగా విలసిల్లుతున్న త్రివర్ణ పతాకాన్ని తయారు చేసిన భారత స్వాతంత్ర సమరయోధుడు ' శ్రీ పింగళి వెంకయ్య పంతులు గారు '.
![]() |
| Sri P Venkaiah during 1921 (approx) |
భోగోళిక శాస్త్రంలో అపార జ్ఞానసంపత్తి కలిగిన శ్రీ వెంకయ్య గారు, వజ్రాల గనులు, ప్రత్తి ఉత్పత్తి - పెరుగుదల మొదలగు అనేక అంశాలపై అనేక సంవత్సరాల అధ్యయనం చేసి బ్రిటిష్ శాస్త్రజ్ఞులను సైతం అబ్బురపరిచే అనేక విషయాలు కనుగొన్నారు. అభిమానంగా ఆయనను డైమండ్ వెంకయ్య, కాటన్ వెంకయ్య అని పిలుచుకునేవారట.
కంబోడియా ప్రత్తి ఆయన వెలికి తీసిన అద్భుతాలలో ఒకటి.
ప్రజ్ఞావంతుడయిన శ్రీ వెంకయ్యగారు ఒక రచయిత, కవి , బహుభాషాకోవిదుడుగూడాను.
హిందీ,ఇంగ్లీష్లతో పాటు ఉర్దూ, జపనీస్ భాషలలో కూడా అనర్గళంగా మాట్లాడేవారట.
అగ్రహారాన్ని, పొలాలని, తోటల్ని, గడించిన సమస్తాన్ని స్వరాజ్యపోరుకై హారతి కర్పూరంచేసిన ఆ మహానుభావుడు......
స్వంతంత్ర భారతావనిలో తన ఆఖరి పదిసంవత్సరాల జీవితాన్ని అత్యంత దుర్భరమయిన పరిస్తితులలో గడిపారు.
![]() |
| కీ. శే !! శ్రీ పింగళి వెంకయ్య గారు |
87 సంవత్సరాల వయసులో....విజయవాడలో ఏదో మారుమూల, ఓ పూరిపాకలో.....కనీసం కడుపునిండా తినడానికి కూడా నోచుకోని స్థితిలో వారు కాలం చేయడం.... మన జాతికి , మన నాయకులకి, ఈ ప్రజలకీ, ఈ మహనీయుల పట్ల ఎంతటి గౌరవాభిమానాలున్నాయో చెప్పకనే చెబుతోంది.
------------------------------------------------------------------
అయ్యా ! శ్రీ పింగళి వెంకయ్యగారు ......మీవంటి వారిని అంతగా క్షోభ పెట్టినందుకు తగిలిన శాపమో పాపమో .....
65 వసంతాల నిండు ముత్తైదువు అయిన ఈ భరతమాత, పాపం నేటికీ తప్పటడుగులు వేస్తూ, ఇంకనూ నడక నేర్చుకునే స్థితి లోనే ఉండిపోయింది. మదమెక్కిన పాలకులపై , పదవి వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయిన నాయకులపై, అవినీతి మయమయిన ఈ దేశ రాజకీయవర్గాలపై , త్వరలో ఈ దేశ ప్రజ తిరగబడి చేయబోయే మరో స్వరాజ్యపోరాటంలో మీవంటి వారి విజయగాధాలే మాకు స్ఫూర్తి ప్రదాతలు అని ప్రగాడంగా విశ్వసిస్తూ.......
మరొక్క సారి గట్టిగా ......
"వందేమాతరం"
![]() |
| వారి జ్ఞాపకార్ధం పోస్టల్ డిపార్టుమెంటు వారి గౌరవం |
ఆఖరిగా ఒక్క మాట : 1963లో శ్రీ వెంకయ్య గారు చనిపోయాక వారి దిండు కింద దొరికిన కాగితాలలో ఒక కాగితం పై రాసున్న ఈ ఇంగ్లీషు పద్యం.....అంత దారిద్ర్యంలోనూ ఇసుమంతయినా తగ్గని వారి దేశభక్తిని చాటి చెబుతుంది.
The tricolour ensign of our rich domain
Shall fly aloft and there for ever and ever remain
To remind the world of our famed Maurian Asoka the great
Of vast empire, peaceful and brotherhood state.
Sacrificial saffron will for noble courage stand,
Peaceful white is the truthful central band,
Parrot green will rich chivalry and faith denote.
ఓ మహనీయుడా.....నీకు జోహార్
జై కిషన్ శింగరాజు









Interesting and informative article! Thanks for posting it!
ReplyDelete